చిరు గాలి,
పిల్ల కాలువ,
వడ గళ్ళు,
ఇవన్నీ చిన్నవే...కానీ మనకి అవి కలిగించే అనుభూతి, మనలో పుట్టించే భావాలు...
జోరు గాలి,
మహా నది,
మంచు కొండలు... కలిగించలేవు... పుట్టించలేవు...
చిన్న పదాలైన,రెండే వాఖ్యాల్లొ మంచి అనుభూతిని కలిగించారు...
ఇంకా సున్నితత్వపు జాడలు ఎరిగిన వాళ్ళు రాధిక గారి మాటల్లొని భావాలు వెతుక్కోగలరు...నేను వెతుక్కున్నాను :-)
1 comment:
దీపు
బ్లాగు రాయాలనిపించినందుకు అభినందనలు.
నేనేమీ పెద్దవాణ్ణి కాను.
చిన్నప్పటినుంచే(3వ తరగతినుంచి) బొమ్మలువేసిన గుర్తు,
నేను ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో శ్రీ నేరెళ్ళ వేణుమాధవ్ మిమిక్రీని ఇష్టపడి నేర్చుకున్నాను, ఆనేపద్యంలో చాలావిషయాలు తెలుసుకున్నప్పటికీ ప్రదర్శించే అవకాశాలు సందర్భాలు, ప్రోత్సాహాలు కలుగలేదు.
అందుకే యువతను ప్రోత్సహించాలనే వుద్దేశంతో ప్రతీ సంవత్సరం ఏలూరు కేంద్రంగా ప్రోత్సాహ బహుమతులను ఇస్తున్నాము.
ఎపరి దగ్గరైనా సృజన పరమైన అంశము కనిపించినప్పుడు ప్రోత్సహించాలనే ప్రయత్నం.
జాన్ హైడ్ కనుమూరి
Post a Comment