ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Tuesday, July 28, 2009

దివ్య రాగం... {గీతాంజలి ~ 3}

నీవెలా పాడతావో నాకు తెలియదు, నా స్వామీ! నేను ఎప్పటికీ అబ్బురంతో మౌనంగా వింటాను.

నీ రాగాల కాంతి ఈ ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తుంది. నీ రాగాల ప్రాణ వాయువు విశ్వాంతరాళాల్లో వ్యాపించి ఉంది. పావనమైన నీ రాగాల ప్రవాహం కఠినమైన అడ్డంకులని చేధిస్తూ పరవళ్ళు తొక్కుతుంది.

నీ పాటతో మమేకమవ్వాలని నా హృదయం ఉవ్విళ్ళూరుతుంది, కానీ గొంతు విప్పడానికి విఫలయత్నం చేస్తుంది. గొంతు విప్పి, మాటలు పాట కాలేక, తత్తరపడుతూ నేను రోదిస్తాను. ఓ నా స్వామీ! నీవు అనంతమైన నీ రాగాల వలలో నా హృదయాన్ని బందీని చేసావు కదా!.




I know not how thou singest, my master! I ever listen in silent amazement.

The light of thy music illumines the world. The life breath of thy music runs from sky to sky. The holy stream of thy music breaks through all stony obstacles and rushes on.

My heart longs to join in thy song, but vainly struggles for a voice. I would speak, but speech breaks not into song, and I cry out baffled. Ah, thou hast made my heart captive in the endless meshes of thy music, my master!

6 comments:

మరువం ఉష said...

ఆ బందీతనంలోని మౌన రోదనే స్వామీ నీకు నేవేసే బంధం అని ఒక మాట కలపాలనివుంది, దిలీప్. ఆర్థ్రత అలరారు అనువాదం.

కాలనేమి said...

Awesome!

I would like to see you translating whole of Gitanjali. Tagore is not just a poet. He is Rishi, Seer. Rishi is one who *sees* things in a state of consciousness which is not ordinary, and a seer poet like Tagore converts those visuals to poetry, to songs.

Tagore engulfs you. Amazes you. He makes you laugh, weep and dance in ecstasy. If only one could translate the ripples that Tagore creates in one's heart to words. They would be beautiful paintings. Melodious songs. Eternal beauty and eternal melody!!

You are doing a very good job :)

చావాకిరణ్ said...

చాలా బాగుంది.

కామేశ్వరరావు said...

మీ అనువాదాలలో ఒక ప్రవాహగుణం కనిపిస్తోంది. అది నాకు నచ్చింది.
"కఠిన అడ్డంకులని" - "కఠినమైన అడ్డంకులని"గా మారిస్తే బాగుంటుందని నాకనిపించింది.

Bolloju Baba said...

beautiful

good going

bollojubaba

ఏకాంతపు దిలీప్ said...

@ ఉషా గారు
ఆర్ధ్రత! నేను బంధాల్లో, కవితల్లోనూ వెతుక్కునేది అదే. నేను ఈ అనువాదంలో ఆ ఆర్ధ్రతని నిలుపగలిగాను అని తెలిపినందుకు చాలా నెనర్లు.

@కాలనేమి
Thank you. could not agree more. He captivated me. I dont know, how I missed Gitanjali till now. It is so divine,universal and so close to my heart. I will try to translate all. Let us see if I can.

@ చావా కిరణ్, భైరవభట్ల, బాబా గార్లకి
ప్రోత్సహిస్తున్నందుకు నెనర్లు.