ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, July 29, 2009

దివ్య చైతన్యం... {గీతాంజలి ~ 4}


నా జీవన చైతన్యమా! నీ చైతన్య స్పర్శ నా అంగాంగంపై ఉందనే స్పృహతో, నా దేహాన్ని నిత్యం పరిశుద్ధంగా ఉంచుకో యత్నిస్తాను.

నా చిత్తంలో ఆత్మ జ్యోతిని రాజేసిన సత్యానివి నీవేననే స్పృహతో, నిత్యం నా ఆలోచనల నుండి అసత్యాలని దూరం చేయ యత్నిస్తాను.

నా హృదయాంతరపు కోవెలలో నీవు ఆసీనుడవై ఉన్నావనే స్పృహతో, నిత్యం నా హృదయం నుండి చెడుని పారద్రోలి, నా ప్రేమని కుసుమింపచేయ యత్నిస్తాను.

నా చేతలకి సత్తువనిచ్చేది నీ మహిమేనన్న స్పృహతో, నిరంతరం నా చేతల్లో నిన్ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను.





Life of my life, I shall ever try to keep my body pure, knowing that thy living touch is upon all my limbs.

I shall ever try to keep all untruths out from my thoughts, knowing that thou art that truth which has kindled the light of reason in my mind.

I shall ever try to drive all evils away from my heart and keep my love in flower, knowing that thou hast thy seat in the inmost shrine of my heart.

And it shall be my endeavour to reveal thee in my actions, knowing it is thy power gives me strength to act.

2 comments:

Anonymous said...

"నా చేతలకి సత్తువనిచ్చేది నీ మహిమేనన్న స్పృహతో, నిరంతరం నా చేతల్లో నిన్ను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను."

Awesome! It has been that way since you started. To avoid redundancy, I will go back to the 'lurker' mode and wait for the admirable series of posts :)

Neelima said...

hey dileep,


ee divya chaitanyam anedi purusha lingama? nee kavitha lo alaage refer chesaavu....

I liked it a lot....only thing nuvenduku "aseenudavi" ani vadaavo ardam kaaledu I mean u referred to it as a male gender....female ithe inka andam vachedemo....jus naa opinion ...but its awesome one!!