ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Monday, July 26, 2010

వర్షం

అసలైతే ఆ చెట్టు కొమ్మలు చేతికందేవే కావు
వాన కురిసింది
వొంగిన ఆ కొమ్మలు పిల్లల చేతుల్లో పుల్లలవుతున్నాయి.

అసలైతే ఆతను నిబ్బరానికి చిరునామా
కన్నీళ్ళు కురిసాయి
కుంగిన ఆతను పది మందిలో పలుచన అయ్యాడు

5 comments:

మోహన said...

మేఘం కరిగిపోవటం, తడిసిన చెట్లు వాలిపోవటం - ఇవన్నీ ఎంతో సహజమైన పరిణామాలు. అందుకేనేమో అందమైనవి కూడా..

చెట్టు కొమ్మలైనా.. మనసు పందిరైనా కృంగితే పలుచనయ్యేది కేవలం మనిషికే. ప్రకృతిలో మరే ప్రాణిలోను కనిపించని 'చిన్న చూపు' అనే భావం మనిషిలో ఉండటం చాలా బాధ కలిగించే విషయం. ఈ భావమే, మనిషిలో పుట్టి అతని మనుగడను తొలిచేసే ఎన్నో పురుగుల(complexes)కు మూలం. కారణాలు చూపి పలుచన చెయ్యకుండా ప్రేమ పంచాగలిగే రోజులు ఎప్పుడొస్తాయో!

చందు said...

chala bgundi :-)

పద్మ said...

ఆ పదిమందికి అతను పలుచన. అందరికీ కాదు. అతనికి అంతకన్నా కాదు. కొమ్మ వాలటం తాత్కాలికమే. వర్షం వెలిసాక మళ్ళీ అందనంత ఎత్తుకి ఎదగటం సహజమే. కష్టాలకి తాత్కాలికంగా కుంగిన అతను మళ్ళీ పుంజుకుంటాడని నమ్మని ఆ పది మంది ఆలోచన కూడా తాత్కాలికమే.

Krishna said...

So truth. Good post.

ఏకాంతపు దిలీప్ said...

@ మోహన గారు
నిజం!

@ పద్మ గారు
అచ్చం అవే మాటలని నేను ఒక ఫ్రెండ్ తో చెప్పాను. ఎప్పటిలానే మీరు నా ఆలోచనలని ఎలా పట్టేస్తారో అర్ధం కాదు.

@ సావి రహే, కృష్ణ
నెనర్లు అండీ.