ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...
వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Saturday, July 3, 2010
నిదురపో నేస్తం...
ఇవి ఈ మధ్య నా ఊహలు చెప్పిన ఊసులు...
కొన్ని అమ్మాయి ఊహలని అబ్బాయి చెప్తున్నట్టు, కొన్ని అమ్మాయికి అబ్బాయి చెప్పే ఊసులు..
~~~~~~~~~~~~~~~
కోటీ కలలా నీ కళ్ళూ
కోటీ చుక్కాలా నీలాంబరాలూ
చుక్కాలున్నాచోటే చందురూడూ
చిక్కేను నీ కనుల ఓ నిండూ పున్నమీ నాడూ
~~~~~~~~~~~~~~~
అడగాలేదని నేనూ అడగాలేదని
అలిగినా నీ కళ్ళు మండే గోళాలు
పలకనీ నీ పెదవులు పట్టు కర్రలు
బుంగా మూతీ నీ బుగ్గలు కఠిన పాషాణాలు
అడగాలేదనీ అలకెందుకే
అడుగుతాననీ తెలిసీ కులుకెందుకే
నీ అలకనీ నేనూ ఓర్చలేనూ
ఇదిగో అడుగుతున్నాను నేను ప్రేమతో
చెలీ, కనికరించి నను కాసుకో!
~~~~~~~~~~~~~~
కలత చెందకు నేస్తం
కలలు కనే కళ్ళని కనికరించు నేస్తం
కలలు నిజమాయే వేళ రాలేదని
కను రెప్పల కౌగిలిని కనుపాపలకి దూరం చెయ్యకు నేస్తం
నిజమయ్యే కలలని నిండుగా చూపించేందుకు
ఆ కనుపాపలకి విరామం కావాలి నేస్తం
కలత చెందకు నేస్తం
నిదురపో నేస్తం
~~~~~~~~~~~~~~
కనుల కొలనులో కౌముది నిలిచే వేళలో
మనసు నీరధిలో అలలు నిను తలచే వేళలో
కలల తీరానికి నను చేర్చమని
నను ఈ అలల తాకిడి నుండి తప్పించమని
నెలరాజుని నిలదీస్తున్నాను..
~~~~~~~~~~~~~~
అడిగినా సరే అడగాలేదని అంటావు
నువ్వడిగిందే ముందూ అంటావూ
నేననడిగింది కానే కాదంటావు
వేడుకోలుకి వేళేనా ఇది?
నీ దోబూచులాటలో దారేది?
చెలీ చెప్పుకుంటున్నానూ
ఇలా వచ్చి ఆలకించూ..
~~~~~~~~~~~~~~
మౌనమే నీ బాష అయినపుడు
నీ ఉనికిలో ఒదిగిపోతా
నీరవ నిశీధిలో చంద్రాన్ని కనుగున్నట్టు
నిను చూస్తూ నీ ఒడిలో నిదురపోతా
~~~~~~~~~~~~~~
Subscribe to:
Post Comments (Atom)
11 comments:
Nice feelings..
చాలాబాగుంది.
ఆ మౌనానికి త్వరలోనే భాష రావాలని కోరుకుంటున్నాను. :)
ఇంతకీ బొమ్మేది? బొమ్మ లేని కవితేంటి?
vacchestundile kundanapu bomma.. nacchindi dileep
అడగాలేదనీ అలకెందుకే
అడుగుతాననీ తెలిసీ కులుకెందుకే..
చాలాబాగుంది.
ఒక్కో కవిత ఒక్కో ఆణిముత్యంలా ఉంది. చూస్తున్నకొద్దీ మైమరపించే వెన్నెలలా, చదువుతున్న కొద్దీ నచ్చేస్తున్నాయి. బాగున్నాయి.
అమితంగా నచ్చిన ప్రయోగాలు...
>>కోటీ కలలా నీ కళ్ళూ
కోటీ చుక్కాలా నీలాంబరాలూ
>>బుగ్గలు కఠిన పాషాణాలు
>>కను రెప్పల కౌగిలి
>>నిజమయ్యే కలలని నిండుగా చూపించేందుకు
ఆ కనుపాపలకి విరామం కావాలి నేస్తం
గుర్తు వచ్చేను కూనలమ్మ పదాలు
గుర్తు వచ్చేను కూనలమ్మ పదాలు
యద మాటున మీటేనూ ఎంకి పాటలు
గుర్తు వచ్చేను కూనలమ్మ పదాలు
యద మాటున మీటేను ఎంకి పాటలు
ఆ తరహా ఉన్నవి మీ భావాలు
భలే పసందుగా ఆ ఇద్దరి ఊసులు
(ఆ ఇద్దరు : మీ కవితలోని అమ్మాయి అబ్బాయి )
అందరికీ నెనర్లు...
@కృష్ణ
అది చాలా పెద్ద కాంప్లిమెంట్! ఎంకి పాటలు నేనెప్పుడూ చదవలేదు.ఒకసారి చదవాలి.
neeradhi ante meaning entandi..........
@వినయ్
సముద్రం అండి.
nIrava ante yentandi
Post a Comment