ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, September 8, 2010

ఆనతినీయరా { గీతాంజలి ~ 17 }

ఈ జగపు జాతరకి నాకు ఆహ్వానం అందింది, దానితో నా జన్మ ధన్యమైనది. నా కన్నులు కన్నాయి, చెవులు విన్నాయి

ఈ వేడుకలో నా పని నా వాయిద్యాన్ని స్వరపరచడం, మరి నేను చేయగలిగినదంతా చేసాను

ప్రభూ, ఇప్పుడు నేను అడుగుతున్నాను, చివరికి నేను బయలుదేరి నీ రూపాన్ని కాంచి మౌనంగా ప్రణమిల్లే సమయము ఆసన్నమైనదా అని?చావా కిరణ్ అనువాదం ఇక్కడ


I have had my invitation to this world's festival, and thus my life has been blessed. My eyes have seen and my ears have heard.

It was my part at this feast to play upon my instrument, and I have done all I could.

Now, I ask, has the time come at last when I may go in and see thy face and offer thee my silent salutation?